శ్రీముఖి పట్ల యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను తమ సినిమాకి ఉపయోగించుకోవాలని ‘బాబు బాగా బిజీ' నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఈ సినిమాపై జరిగిన చర్చలు మరి ఏ సినిమా పైనా జరగలేదు. 

హిందీలో ఘన విజయం సాధించిన ‘హంటర్’ మూవీకి రీమేక్ గా రొమాంటిక్ కామెడీ పేరుతో ఒక బూతు సినిమాగా మే 5న విడుదల కాబోతున్న ఈసినిమా చేస్తున్న సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి 2’ విడుదలైన కేవలం వారం రోజులకు ఆ సినిమా సునామీని లెక్క చేయకుండా కేవలం తన బూతు కంటెంట్ ను నమ్ముకుని యూత్ ను టార్గెట్ చేయడానికి వస్తున్న ఈసినిమా పై రకరకాల వివాదాలు ఉన్నాయి. 

ఇప్పటికే మంచి నటుడుగా దర్శకుడుగా పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, శ్రీముఖి, తేజస్విలు నటించిన ఈసినిమాకు సంబంధించి ఒక షాకింగ్ రూమర్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌కు యాంకర్ శ్రీముఖి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రమోషన్ కొసం ఇతర హీరోయిన్లతోపాటు శ్రీముఖితో కూడ ఫొటోషూట్ చేయాలని చిత్ర నిర్మాతలు శ్రీముఖిని సంపద్రించారట.  

అంతేకాదు సినిమా ప్రచారం కోసం ఉపయోగపడేలా సహకరించాలని వారు కోరారని టాక్. అయితే శ్రీముఖి మాత్రం ఈ కార్యక్రమానికి రాకుండా ఈ సినిమా నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే మిగితా వారితో పోల్చుకుంటే శ్రీముఖి క్రేజ్ ఎక్కువ కాబట్టి ప్రచార పోస్టర్లకు శ్రీముఖిని వాడుకోవాలని నిర్మాతలు ఎంతో ప్రయత్నించినా శ్రీముఖి తనకు సమయం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించి ఈసినిమా నిర్మాతలకు అనుకోని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  

ఇది ఇలా ఉండగా ఇటీవల ‘బాబు బాగా బిజీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పుడు ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్లు షాక్ గురయ్యారట. సినిమాలో కొన్ని సీన్లు చూడలేక సెన్సార్ బోర్డు మహిళా అధికారులు బయటకు వెళ్లిపోయినట్టు  వార్తలు వస్తున్నాయి. ఇంత బూతు కంటెంట్ ఉంది కాబట్టే ‘బాహుబలి 2’ సునామిని కూడా లెక్క చేయకుండా ఈసినిమా మే మొదటి వారంలో ధైర్యంగా విడుదలకు రెడీ అవుతోంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: