ఒక టాప్ హీరో సినిమాకు 5/5 స్టార్స్ ఇస్తూ ఒక అద్భుతమైన రివ్యూ ఒక క్రిటిక్ వ్రాస్తే ఆ టాప్ హీరో అభిమానులు సంబర పడిపోవాలి. అయితే దీనికి విరుద్ధంగా ‘బాహుబలి 2’ విషయంలో జరుగుతోంది. ఈరోజు అర్ధరాత్రికి వస్తంది అని అనుకున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా రివ్యూ ముందే వచ్చేసింది. 

భారతీయ చిత్రాలను ముందే చూసే యూఏఈకి చెందిన సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశాడు.  దుబాయ్ లో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోను చూసి ఉమేర్ సంధూ ‘బాహుబలి 2’ సినిమాకు 5 స్టార్లు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా  అద్భుతంగా, చూడముచ్చటగా ఉంది అని ట్వీట్ చేయడమే కాకుండా  భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని చిత్రం ‘బాహుబలి’ అని ఉమేర్ ఈ మూవీని ఆకాశానికి ఎత్తేస్తుస్తున్నాడు.  

ఈసినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రధానంగా బాహుబలి2 స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అని అంటూ ఈమూవీకి సంబంధించి మైండ్ బ్లోయింగ్ స్టోరీ  స్క్రీన్ ప్లే ఆయువుపట్టు అంటూ త్విట్ చేసాడు. తన బ్లాగ్ లో ఈ సినిమా పై అద్భుతమైన రివ్యూ వ్రాస్తూ ఈసినిమాలో ఒక్క సీన్ కూడ వృధాగా లేదు అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. 

అంతేకాదు ఇప్పటి వరకు భారత్ లో నిర్మాణం జరుపుకున్న అద్భుతమైన సినిమాలలో ‘బాహుబలి’ ఒకటి అని అంటూ శుక్రవారం ఈసినిమా విడుదల అయ్యాక భారతీయ సినిమా చరిత్ర తిరగరాయడం ఖాయం అని అంటున్నాడు. చివరిగా ఈమూవీని చూసిన వారందరూ ‘బాహుబలి2’ గొప్పతనాన్ని  పొగుడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారని భారత సినీ పరిశ్రమ  గర్వించే దగ్గరలోనే ఉన్నాయి అంటూ అభిప్రాయ పడుతున్నాడు ఉమేర్. అయితే ఈ రివ్యూ ప్రభాస్ అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నా ఒక బ్యాడ్ సెంటిమెంట్ ను అభిమానులకు గుర్తు చేస్తోంది.

గతంలో ఉమేర్ ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలను ఇలా విడుదల కాకుండానే ముందే చూసి ఆసినిమాలు అద్భుతం అంటూ రివ్యూలు వ్రాసాడు. అయితే ఆ సినిమాలు భయంకరమైన ఫ్లాప్ లుగా మారాయి. అటువంటి ఉమేర్ ప్రశంసలు ‘బాహుబలి 2’ కి సెంటిమెంట్ గా చెడు చేస్తాయా అన్న భయంలో ప్రభాస్ అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: