బాహుబలి కి సంబంధించి ఉన్న క్రేజ్ ని ఎలా క్యాష్ చేసుకుందామా అని ప్రతీ ఒక్కరూ ఎగబడుతున్నారు. చివరకి ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికే సినిమాని విపరీతమైన ధరలకి అమ్మడం, ఎక్కువ షో లు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా టికెట్ రేటు విషయం లో కూడా ఇష్టం వచ్చినట్టు పెంచి పారేస్తున్నారు. రెండు వేల నుంచి మూడు వేల వరకూ ఈ సినిమా టికెట్లు అమ్మి పారేస్తున్నారు అది కూడా అధికారికంగా ఒక్కొక్క టికెట్ నీ సింగిల్ స్క్రీనింగ్ లో రెండొందల కి అమ్ముతున్నారు.


ఇవన్నీ చూసిన తెలంగాణా ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌పీ మంత్రి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసు కుని థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని, బాహుబ‌లి టీమ్ ను హెచ్చరించారు. " బాహుబలి టీం కి ప్రమోషన్ తో పని లేదు, ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్ సమయం నుంచి అనేక విషయాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు, తెలుగు ఖ్యాతి ని పెంచిన సినిమా అని మేము స్పెషల్ పర్మిషన్ లు అందించాము దాని అర్ధం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచుకోవడం కాదు.


బాహుబలి కి ఐదు షో లు ఇవ్వడమే మేము చేసిన మేలు . ఇది సినిమా నిర్మాతలు , ధియేటర్ ల యాజమాన్యాలూ దృష్టిలో పెట్టుకోవాలి " అన్నారు మంత్రి. " దీనిపై ఓ స‌మావేశం కూడా ఏర్పాటు చేశాం. గ‌వ‌ర్న‌మెంట్ ఫిక్స్ చేసిన రేట్ల‌కు టిక్కెట్లు అమ్మాలి లేక‌పోతే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. బాహుబ‌లి టీమ్ ప్ర‌మేయం లేకుండా థియేట‌ర్ల యాజ‌మాన్యం ఇష్టాను సారంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. దానికి మాత్రం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. " అన్నారు. బెనిఫిట్ షో లకి పర్మిషన్ లు కూడా లేవు అన్నారు ఆయన .

మరింత సమాచారం తెలుసుకోండి: