రోజుకి ఐదు షోలు వేసుకోండి ఆరు షో లు వేసుకోండి అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే పూర్తిగా పర్మిషన్ ఇచ్చేస్తే ఇక పంపిణీ దారులు ఆగుతారా ? వెంటనే సిద్దం అయిపోయారు డిస్ట్రిబ్యూటర్ లు. ఈ మధ్య కాలం లో మెగా సినిమాలు ఐన ఖైదీ , కాటంరాయుడు లాంటి సినిమాలకి పర్మిషన్ లు ఇవ్వని ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు బాహుబలి కి పూర్తిగా పచ్చ జండా ఊపేసి కాస్తంత కూడా టైట్ చెయ్యకపోవడం తో బాహుబలి నిర్మాతలు , బయ్యర్ లు పెట్రేగిపోతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున కాకుండా గురువారం రాత్రి నుంచి వారు తమ సినిమా కి సంబంధించి షో లు వేసేస్తున్నారు.


నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి నిజాం లో సినిమా ని కొన్న నిర్మాతలు , బయ్యర్ లు ఇవాళ రాత్రి నుంచి సెకండ్ షో లతో ఈ సినిమా ప్రీమియర్ లు పైడ్ ప్రీమియర్ లుగా తీర్చి దిద్ది మల్టీ ప్లేక్స్ లు గా ప్లాన్ చేసారు. 10 గంటలకు ప్రారంభయ్యే షోతో ఏకంగా అమెరికా కంటే ముందే మన దేశంలో బాహుబలి బెనిఫిట్ షోలు పడిపోతాయనమాట.


అలాగే రాత్రి 10 గంటలకు షో వేశాక.. సినిమా నిడివి 3 గంటలు ఉంది కాబట్టి.. తక్కువ ఇంటర్వెల్ గ్యాపిచ్చి.. 12 గంటలకు మరో షో.. 3 గంటలకు ఇంకొక షో.. 7 గంటలకు మరొకటి.. 10 గంటలకు.. 1 గంటకు.. 4 గంటలకు.. 7 గంటలకు.. 10 గంటలకు ఇతర షోలు వేయాలని ప్లానింగులో ఉన్నారట. మరి గవర్నమెంట్ వీరికి రోజుకు 5 షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చిందిగా.. ఎలా మ్యానేజ్ చేస్తారు గురూ? 

మరింత సమాచారం తెలుసుకోండి: