మరి కొద్ది గంటలలో ‘బాహుబలి-2’ మొట్టమొదటి టాక్ బయటకు రాబోతోంది. బ్రహ్మాండమైన ప్రమోషన్లతో ఇప్పటికే దీనిప్రచారం పీక్ దశకు చేరుకుంది. ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే అప్పుడే ఈచిత్రానికి లక్ష అడ్మిషన్స్ వచ్చాయి అన్న వార్తలు అందరి మైండ్స్ ను బ్లాంక్ చేస్తున్నాయి.  ఈపరిస్థితులలో మన దేశంలోని థియేటర్లలో సునామీ సృష్టించడానికి ‘బాహుబలి 2’ రెడీ అయిపోయింది.  అయితే ఈ హైప్ అంతా ‘బాహుబలి 2’ గురించి కాకుండా కట్టప్ప ‘బహుబలి’ ని ఎందుకుచంపాడు అన్న పాయింట్ చుట్టూ తిరగడం ఒక విధంగా ఈసినిమాకు శాపంగా మారనున్నదా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ విషయంలో  ప్రేక్షకుల అంచనాలు తిరగపడితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చునన్నది విశ్లేషకుల అభిప్రాయం. కట్టప్ప ‘బహుబలి’ ని ఎందుకు చంపాడు అన్నరహస్యం అందరికీ లీక్ అయిపోతే  ఈసినిమా పై ఇంట్రెస్ట్ తగ్గిపోయి టీవీల్లో చూసేద్దాంలే అనే పరిస్థితి ఈసినిమాకు రెండవ వారం నుండి ఏర్పడినా ఆశ్చర్యంలేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.  అంతేకాదు రాజమౌళి ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో చూపించిన కధకు సెకండ్ పార్ట్ లోచూపించే కధకు పొంతన లేకపోతే రెండుముక్కలుగా సినిమా చూశామే అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు ఏర్పడే అవకాసం కూడ ఉంది అన్న అనుమానాలు మరికొందరు విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.  

దీనితో ఈరెండు విషయాలలో ఏఒక్క విషయంలో తేడజరిగినా దానిప్రభావం  ఈమూవీ కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. ఇదిఇలా ఉండగా ప్రభాస్ నిన్న ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మరింత హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. బహుశా కట్టప్ప భల్లాల దేవుడ్ని చంపబోయి చీకట్లో కనిపించక కట్టప్ప బాహుబలిని హతమార్చి వుంటాడనే ఒపీనియన్ ను ప్రభాస్ నవ్వుతు వ్యక్తం చేశాడు. 

దీనితో నిజంగా ఇలాంటి చిన్నపాయింట్స్ మీద ‘బాహుబలి 2’ లాంటి భారీ సినిమాకు కధను అల్లరుకదా అంటూ చాలామంది ప్రభాస్ మాటలకు నవ్వుకున్నారు.  అంతేకాదు భారీఅంచనాలు ఉన్న ఈసినిమా పై రిలీజ్‌కి ముందు ప్రభాస్  ఇలా నార్మల్‌గా కామెంట్ చేయడం ఈమూవీకి నెగిటివ్ గా మారుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో రెండేళ్లుగా అభిమానులను వెంటాడుతున్న ఈప్రశ్నకు ఇలా సింపుల్‌గా  ప్రభాస్ తేల్చేసి ఈవిషయం పెద్దగా ప్రయార్టీలేని విషయంగా చూడామని ప్రభాస్ ఈసినిమా చూడబోయే ప్రేక్షకులకు సంకేతాలు ఇస్తున్నాడా అన్న అనుమానాలు కూడ కలుగుతున్నాయి.  

దీనికితోడు ఇదేవిషయమై ఈమధ్య మాట్లాడిన డైరెక్టర్ రాజమౌళి సైతం బహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు అన్నవిషయాన్ని  సీరియస్ గా చూడకుండా ‘బాహుబలి 2’ లోని మిగతా అద్భుతమైన విషయాల పై దృష్టిపెడుతూ ‘బాహుబలి 2’ ని చూడమనని చెప్పిన నేపధ్యంలో ‘బహుబలి 2’ కి పెనుప్రమాదంగా ఈరెండు విషయాలు మారే అవకాశం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: