అందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న బాహుబలి2 మూవీ మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీని చూడాలనేది ప్రతి సినీ ప్రేక్షకుడికి ఉన్న క్రేజ్. అయితే థియోటర్స్ వద్ద మాత్రం ఆ పరిస్థితి మరొలా కనిపిస్తుంది. బాహుబలి2 మూవీ ఇంకా రిలీజ్ కాలేదు…అప్పుడే పలు థియోటర్స్ వద్ద ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ ని బ్లాక్ లో విక్రయిస్తున్నారు.


ఒక్కో టికెట్ రేటు చూస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…సాధారణ క్లాసు అంటే 10 రూపాయలు టికెట్ విలువ ఇప్పుడు 300 రూపాయల నుండి 600 రూపాయలు పలుకుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది 1000 రూపాయల వరకూ వెళుతుంది. ఇక సెకండ్ క్లాస్ టికెట్స్ అంటే 40,60 రూపాయల టికెట్స్ అయితే700 రూపాయల నుండి ప్రారంభం అయి…1200 వరకూ వెళుతున్నాయి.


కొన్ని సందర్భాల్లో ఇది 1500 రూపాయల వరకూ వెళుతున్నాయి. ఇక బాల్కానీ టికెట్స్ కి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతుంది. ప్రారంభం టికెట్ ధర 1500 నుండి అత్యధికంగా 5000 వరకూ వెళుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కొన్ని థియోటర్స్ లో అప్పుడే ఈ బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది.


దీంతో సామాన్య ప్రేక్షకుడు రిలీజ్ రోజున లైన్లో నిలబడి సినిమా చూడాలంటే…చొక్కాలు చినిగిపోవటం తప్పితే థియోటర్ పెట్టిన రేటుకి టికెట్ ని ధక్కించుకోవటం సాధ్యా కాని విషయం అని అంటున్నారు. మొత్తంగా బాహుబలి2 క్రేజ్ ప్రేక్షకులను నిద్రలేకుండా చేస్తుంటే…బ్లాక్ మార్కెట్ కి మాత్రం ఇది కనకవర్షం కురిపిస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: