యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమాధానం బయటికి వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బాహుబలి’ తొలిభాగం సంచలన విజయం సాధించింది.  భారతీయ సినిమా చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా గురించి జరిగిన చర్చ మరే చిత్రంపైనా జరుగలేదు. తెలుగు సినిమాగా ప్రారంభమై అంచెలంచెలుగా అంచనాలను పెంచుతూ భారతీయ సినిమాగా మారింది. ఆ నేపథ్యంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ అనూహ్య విజయం సాధించింది.  
ఈ ప్రశ్నలకు సమాధానం..
తొలి భాగం అందించిన జోష్ తో మరింత భారీగా రెండో భాగాన్ని రూపొందించారు. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు తొలి భాగంలో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా, ఎమోషన్స్ ను  సీక్వల్ లో చూడొచ్చన్న హైప్ క్రియేట్ చేశారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు.

అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్.  అసలు కట్టప్ప ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టాడు? మహిష్మతి సామ్రాజ్యంలో అమరేంద్ర బాహుబలిని చంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది.

ఆ హత్య వెనుక ఎవరున్నారు? బాహుబలి కుమారుడు మహేంద్ర బాహుబలి తన తల్లి దేవసేనను భళ్లాలదేవ నుంచి ఎలా కాపాడుకున్నాడు? అనే పశ్నలకు సమాధానమే బాహుబలి ది కన్‌క్లూజన్. సినిమా ప్రిమీయం షో పై జనాలు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. అయితే మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బాగా తీశారని కొంత మంది అంటే..కాస్త బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయని మరికొంత మంది అంటున్నారు.  ఏది ఏమైనా నేడు బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సాయంత్రం వరకు ప్రజాలు చెప్పే తీర్పు..కలెక్షన్లు ఎలా ఉంటాయో తెలిసిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: