దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇప్పుడేమో కాని ఒకప్పుడు మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు. అయితే ఇప్పుడొస్తున్న యంగ్ బ్లడుని తట్టుకోలేక కానీవండి లేదా ఇండస్ట్రీ తనపై పెట్టిన భాద్యతల దృష్ట్యా గాని, కొంత కాలంగా సినిమా నిర్మాణం పై ఆయన అంతగా ఇంటరెస్ట్ చూపడం లేదు. కానీ ఒకప్పుడు బాగా ఆడిన చేయు కాబట్టి మళ్ళీ తన మోజు తీర్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నాడు.


ఇందుకోసం ఆయన అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చి మంచి విజయం సాదించిన 'ప్రతిఘటన' చిత్రాన్ని ఎన్నుకోవడమే ఆశ్చర్యం అయితే ఇందులో హీరోయినుగా ఛార్మిని ఎన్నుకోవడం మరి ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయశాంతికి ఛార్మి కి పోలిక ఏంటి? నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా వీరికి ఉంది. అలాంటిది ఛార్మితో ప్రతిఘటన అంటే తమ్మారెడ్డి నిజంగా ముద్దపప్పులో కాలు పెడుతున్నట్లే అని అందరూ అనుకుంటున్నారు.


ఎంత స్క్రిప్ట్ డిమాండ్ చేసినా, ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే హీరోయిన్ ఎంత ఛార్మినే అయినా ఈ టైటిలులో ఛార్మిని ఊహించుకోవడం నిజంగా కష్టమే. అలాంటిది అన్ని తెలిసిన తమ్మారెడ్డి కూడా ఈ తప్పు ఎందుకు చేస్తున్నట్లో అర్ధం కావడం లేదు. ఈ ప్రతిఘటన స్టోరీ వేరేనంట, ఇందులో ఛార్మి జర్నలిస్టు అంట. అయినా ఛార్మికి మరి అంతా పవర్ ఫుల్ టైటిల్ అవసరమా?

మరింత సమాచారం తెలుసుకోండి: