దర్శకుడి పేరు చూసి సినిమాలకు వెళ్లే పరిస్థితి మళ్లీ వచ్చింది. దానికి కారణం రాజమౌళి లాంటి స్టార్ డైరక్టర్స్ సినిమాలే. చెప్పాలనుకున్న కథను ప్రేక్షకులు మెచ్చేలా చేయడంలో రాజమౌళి దిట్ట. అది చిన్న సినిమా అయినా బాహుబలి లాంటి పెద్ద సినిమా అయినా. ఇక రాజమౌళి ముఖ్యంగా మూడు విషయాల్లో చాలా బాగా వర్క్ అవుట్ చేస్తాడు.   


ఒకటి సినిమా ఓపెనింగ్ అంచనాలను పెంచేలా సినిమా ఉంటుంది. ఇక హీరో క్యారక్టరైజేషన్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రాజమౌళి సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ దద్దరిల్లిపోవాల్సిందే. ఇంటర్వల్ తోనే సినిమా హిట్ టాక్ తెచ్చుకునేలా సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఇక అదే రేంజ్ లో క్లైమాక్స్ లో కూడా రాజమౌళి ముగింపు అదిరిపోతుంది. 


తెలుగు సినిమా స్థాయిని పెంచేలా తీసిన బాహుబలి మొదటి రెండో పార్ట్ లో కూడా ఇదే సూత్రాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు జక్కన్న. బిగినింగ్ క్లైమాక్స్ కాస్త కన్ ఫ్యూజ్ చేసినా కన్ క్లూజన్ లో మాత్రం భారీ ఫైట్ తో బాహుబలికి ముగింపు పలికాడు. ప్రత్యేకంగా సినిమా కోసం రాజమౌళి తీసుకునే ఈ జాగ్రత్తలు సినిమా మీద ఆడియెన్స్ దృష్టిని లాగడమే కాకుండా చూసి మెచ్చుకునేలా చేస్తాయి.


నిన్న రిలీజ్ అయిన బాహుబలి-2 కన్ క్లూజన్ కూడా మరోసారి రాజమౌళి దర్శకత్వ ప్రతిభను తెలియచేశాయి. భారతదేశ గొప్ప సినిమా దర్శకులలో రాజమౌళి చేరాడని చెప్పొచ్చు. ఇక తన తర్వాత సినిమాల నుండి ఇదే రేంజ్ సినిమాలు వచ్చేలా జాగ్రత్తపడతాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: