అనుకున్నట్టుగానే బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ రెండిటిని అంచనాలకు తగ్గట్టుగానే తీసి వారెవా  అనిపించుకున్నాడు రాజమౌళి. ఒక సినిమా అది కూడా 150 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా మొదలు పెట్టి నిడివి ఎక్కువవడం వల్ల రెండు పార్టులుగా విడుదల చేయాల్సి వచ్చిందట. అసలు బాహుబలి సినిమా ఐదేళ్లు పడుతుందంటే తాను తీసే వాడిని కాదని రాజమౌళి అన్నాడు కూడా.


ఇక బాహుబలి పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా రాజమౌళి దర్శకత్వ ప్రతిభను చూపించాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి ఈ కథ పూర్తవుతుంది కాని సీక్వల్స్ మాత్రం వస్తాయని అప్పట్లో అన్నాడు జక్కన్న. అంటే బాహుబలి 3, 4 అలా కూడా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. 


బాహుబలి 2 ప్రమోషన్స్ టైంలో మాత్రం వాటి గురించి ప్రస్థావన తీసుకురాలేదు జక్కన్న. అసలు బాహుబలి కొనసాగించే ఆలోచన ఉందా లేకపోతే ఇదవరకు ఎందుకు బాహుబలి మిగతా పార్టులు తీస్తానని అంటాడు. ఉంటే ఎప్పుడు అన్నది ప్రేక్షకుల ప్రశ్న. బాహుబలి తర్వాత సీక్వల్స్ తీస్తే హీరో ఎవరు మళ్లీ ప్రభాస్ తోనే తీస్తాడా లేక మరెవరినైనా సెలెక్ట్ చేస్తాడా ఇలా ఎన్నో డౌట్లు ఉన్నాయి.


వీటన్నిటికి రాజమౌళి ఎప్పుడు ఎలా ఆన్సర్ ఇస్తాడో చూడాలి. బాహుబలి సినిమాతో బాలీవుడ్ హీరోలు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా కోసం క్యూలు కడుతున్నారు మరి వారిని కాదని ఈసారి పెద్ద ప్రాజెక్ట్ కూడా తెలుగు హీరోతో చేస్తాడా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మొత్తానికి బాహుబలి 1,2 తర్వాత బాహుబలి 3 ఎప్పుడు అన్నది ప్రేక్షకులను ఎక్సయిట్మెంట్ కు గురి చేస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: