‘బాహుబలి 2’  సునామి ఎవరి ఊహలకు అందని స్థాయిలో పరుగులు తీస్తోంది. ఒక  తెలుగు సినిమాని హిందీలోకి డబ్‌ చేసి అక్కడ స్ట్రెయిట్‌ సినిమాలకి ధీటుగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం ఒక సంచలం అయితే ఒక తెలుగు సినిమా పేరుతో వివిధ కార్పొరేట్ సంస్థలు తమ ప్రోడక్ట్స్‌ కు తమ ప్రచార కార్యక్రమాల్నిఅత్యంత భారీ స్థాయిలో నిర్వహించడం మరింత సంచలనంగా మారింది. 

నిన్న చాలా హిందీ ఛానల్స్ లో హిందీ సినిమాలు వస్తూ ఉంటే మధ్యలో వచ్చిన  యాడ్స్‌లో  చాలావరకు 'బాహుబలి' బ్రాండ్‌ తో వచ్చినవే కావడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. టాటు  దగ్గర్నుంచి పెయింట్‌ వరకూ అలా అన్ని  'బాహుబలి' పేరుతో యాడ్స్‌ ప్రసారం అయిన నేపధ్యం చూస్తే కార్పొరేట్ ప్రపంచాన్ని కూడ ‘బాహుబలి 2’ ఎలా ప్రభావితం చేస్తోందో అర్ధం అవుతుంది.

దీనితో 'బాహుబలి' సినిమా సాధించిన కలక్షన్స్ రికార్డులతో పాటు ఈ మూవీని ఒక 'బ్రాండింగ్‌' గా చేసుకుని కార్పొరేట్ సంస్థలు చేస్తున్న హడావిడి ఈమధ్య కాలంలో ఏసినిమా విషయంలోను జరగలేదు అన్నది వాస్తవం. దీనితో ‘బాహుబలి 2’ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమేకాదు ఇండియన్ కార్పొరేట్ రంగానికే 'బ్రాండ్‌'గా మారిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా  130 కోట్లు వసూలు చేసింది అని వస్తున్న వార్తలను చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక షాక్ లోకి వెళ్లి పోయింది. ఈ సినిమా సెకండ్ ఆఫ్ కొందరికి నచ్చకపోయినా సరే ఈమూవీ రిలీజుకు ముందు ఉన్న హైప్ ను మించి మరింత క్రేజ్ రావడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 

ప్రస్తుతం కొనసాగుతున్నసునామీని చూస్తున్న విశ్లేషకులు మరో 10 రోజులలో ‘బాహుబలి 2’ తన టార్గెట్ ఫిగర్ 1000 కోట్లు టచ్ చేయడం ఖాయం అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: