బాహుబలి రెండు పార్ట్ లతో ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసింది. అమరేంద్ర బాహుబలి, మహింద్ర బాహుబలిగా ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఐదేళ్ల కెరియర్ లో రెండే రెండు సినిమాలు అది కూడా బాహుబలి 1,2 చేసిన ప్రభాస్ అంతకంత క్రేజ్ దక్కించుకున్నాడని చెప్పొచ్చు. 


నేషనల్ లెవల్ లో ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ తర్వాత చేస్తున్న సినిమా సాహో. రన్ రాజా రన్ లాంటి ఓ చిన్న బడ్జెట్ మూవీ డైరక్టర్ చెప్పిన కథకు ఫిదా అయిన ప్రభాస్ తన రేంజ్ కు స్టార్ డైరక్టర్స్ వెంటబడుతున్నా సరే సుజిత్ కే ఓటేశాడు. ఇక బాహుబలి సినిమాలో సాహో టీజర్ కూడా రిలీజ్ చేశారు.


ఇట్స్ షో టైం అంటూ ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమాలో ఎయిర్ ఫైట్ భారీగా ప్లాన్ చేశాడట చిత్ర దర్శకుడు. బాహుబలితో అందరిని ఆకట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు రాబోతున్న సాహోతో అదే రేంజ్ అంచనాలను సాధించగలడా వాటిని అందుకోగలడా అన్నది ఇప్పుడు అందరి ఆలోచన.


టీజర్ లాస్ట్ లో ఎయిర్ ఫైట్ మాత్రం అదరగొట్టింది. మరోసారి తన నుండి ఓ హాలీవుడ్ స్టాడర్డ్ మూవీ వస్తుందని తెలుస్తుంది. తెలుగు హీరో స్థాయి నుండి ప్రభాస్ ఇప్పుడు ఏకంగా ఇండియ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ తో డైరెక్ట్ హింది సినిమాలు తీసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ప్రభాస్ కేవలం తెలుగు హీరో అనడం కరెక్ట్ కాదేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: