తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న బాహుబలి 2 కోసం టాలీవుడ్  ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన  మోస్ట్ అవేటెడ్ మూవీ బహుబలి2 నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రావడం రావడమే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుని, కలెక్షన్స్ లో దూసుకుపోతుంది.


ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేసి, దాదాపుగా 1000కోట్ల వసూళ్లు సాధించే సినిమాగా నిలపాలి అని పక్కా వ్యూహంతో ఉన్నాడు మన రాజమౌళి. అందుకోసం నెల రోజులు ముందు నుంచే టీమ్ వర్క్ ప్రారంభించారు.  యావత్ భారత దేశంలోనే కాకుండా దుబాయ్ లో కూడా సినిమా ప్రమోషన్స్ చేసి వచ్చారు.  బాహుబలి అనే ఒక చారిత్రాత్మక సినిమా కోసం దాదాపుగా 5ఏళ్లు కష్ట పడ్డాడు దర్శకుడు రాజమౌళి. ఎంతో శ్రమించాడు, ఎన్నో కోట్లు ఖర్చుపేట్టాడు. ప్రతీ సీన్ ని ఒకటి పది సార్లు చెక్ చేసి మరీ తెరకెక్కించాడు. ఎక్కాడా తేడా రాకుండా చూసుకున్నాడు.


సినిమాను చాలా పక్కాగా, పద్దతిగా తీర్చి దిద్దాడు. ఇంకా చెప్పాలి అంటే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అందరి హీరోల అభిమానులను తన ధియేటర్లకు రప్పించుకునే చేశారు.  తొలి 24 గంటల్లో కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి 2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది.


ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే తొలి రోజే 150 కోట్ల మార్క్ కు బాహుబలి 2 చేరువైనట్టే. అయితే అనధికారిక సమాచారం ప్రకారం కలెక్షన్లు 180 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఏరియావైజ్ కలెక్షన్లు :

నైజాం : 14.3 కోట్లు
సీడెడ్ : 9.1 కోట్లు
ఉత్తరాంధ్ర : 6.88 కోట్లు
ఈస్ట్ : 7.29 కోట్లు
వెస్ట్ : 6.78 కోట్లు
కృష్ణా : 3.97 కోట్లు
గుంటూరు : 7.68 కోట్లు
నెల్లూరు : 2.6 కోట్లు
ఏపీ + నైజాం : 58.6 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: