హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఆయన సినిమాలలోని పాటలు తన సినిమాలకు టైటిల్స్ గా పెట్టుకుంటూ తన అభిమానాన్ని చాటుకుంటు ఉంటాడు. అంతేకాదు పవన్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలను తన సినిమాలలో పెట్టుకుని సూపర్ హిట్స్ కొట్టేస్తూ ఉంటాడు. ఇక లేటెస్ట్ గా నితిన్ పురిజగాన్నాద్ సొంత సినిమా ‘హార్ట్ ఎటాక్’ లో  హీరోగా నటిస్తున్నాడు అన్న వార్తలు పవన్ అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పించాయట. దీనికి ప్రధానకారణo భవిష్యత్ లో తాను ఇక పవన్ తో సినిమాలు తీయనని తనకు పవన్ కు మాటల్లేవు-మాట్లాడుకోవడాలు లేవంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పూరి జగన్నాద్ తెలియచేయడం ఒక సంచలనం అయితే ఆ వార్తలకు మండిపడ్డ పవన్ కళ్యాణ్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పూరీ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు ఆఖరి నిముషం లో బ్రేక్ వేసాడన్న వార్తలు కూడా వచ్చాయి.

 ప్రస్తుతం పూరి పవన్ ల మధ్య సంబందాలు లేని పరిస్థితులలో పూరీ తీయబోయే సొంత సినిమాకు హీరోగా నటించడానికి పవన్ వీరాభిమాని నితిన్ అంగీకరించడం పవన్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోందట. రాజకీయాలలో, సినిమాలలో, వ్యాపారాలలో శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరు అన్న విషయం పవన్ అభిమానులకు తెలియదనుకుంటా...  

మరింత సమాచారం తెలుసుకోండి: