అంద‌రి అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. ఎన్నో అంచ‌నాల మ‌ద్య రిలీజైన సింగం2 సూప‌ర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ ద‌గ్గర దూసుకుపోతుంది. దీంతో సూర్య ఫుల్ ఖుషీగా వున్నారు. ఆ సంతోషాన్ని మా ఎపి హెరాల్డ్ తోనూ పంచుకున్నారు. మ‌రి సింగం2 స‌క్సెస్ పై సూర్య ఏమంటున్నారో చూడండి ఎక్స్ క్లూజివ్ గా.....

1. హాయ్ సింగం2 సూప‌ర్ హిట్ ఎలా ఫీల‌వుతున్నారు.?

సూర్య; ఐ యామ్ వెరీ హ్యాపి. హిట్ అవుతుంది అనుకున్నా. బ‌ట్ ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకోలేదు.

2. ఈ హిట్ పై మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి..?

సూర్య; యాక్చూవ‌ల్లీ ...సింగం2 స్టార్ట్ అయిన ద‌గ్గర నుండి మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రిలోనూ టెన్షన్ . ఫ‌స్ట్ పార్ట్ సూప‌ర్ హిట్. అందుకే సెకండ్ పార్ట్ ఆ స్ధాయిలో లేక‌పోతే ఏమ‌వుతుందోన‌ని జ్యోతిక కూడా టెన్షన్ ప‌డింది. బ‌ట్ ఇపుడు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసి త‌ను కూడా హ్యపిగా ఫీల‌వుతోంది.


3.. తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది...?

సూర్య; సూప‌ర్. . నాకు తమిళంలో కంటే తెలుగులోనే మార్కెటింగ్ వుంద‌న్న సంగ‌తి ఈ సినిమాతో నాకు తెలిసింది. ఈ సినిమాకు ఆదరిస్తున్న తెలుగు అభిమానులంద‌రికీ నా ధ్యాంక్స్.

4. ఈ స‌క్సెస్ క్రెడిట్ ఎవరిది అంటారు....?

సూర్య; నో డౌట్. డైరెక్టర్ హ‌రికే చెందుతుంది. ఈ సినిమా కోసం హ‌రి ఎంత క‌ష్టప‌డ్డాడో నాకు తెలుసు. నేను సినిమాలో అలా క‌నిపించాను అంటే.. యాక్షన్ సీన్స్ కి ఆడియెన్స్ అంత‌గా చ‌ప్పట్లు కొడుతున్నారంటే అదంతా హ‌రి మ్యాజిక్కే.

5. మీ కో స్టార్స్ అనుష్క, హ‌న్సికల గురించి...?

సూర్య; అనుష్క గురించి ప్రత్యేకించి చెప్పాలంటారా...? సింగంలో మా ఫెయిర్ ఎలా వుందో సీక్వెల్ లోనూ అలాగే వుందిక‌దా...? అనుష్క, హ‌న్సిక ఇద్దరూ కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు.


6. కొత్తగా డి2 ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ స్ధాపించారు...డి2 గురించి ఏం చెప్పద‌లుచుకున్నారు. .?

సూర్య; య‌స్. డి2 ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై నా సినిమాలు వుంటాయి. అలాగే కొత్త ద‌ర్శకుల‌ను పొత్సహించాల‌నుకుంటున్నారు. ఎట్ ది సేమ్ వే ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేయాల‌నుకుంటున్నాను.

7. ఓకే ఆల్ ది బెస్ట్ సార్

సూర్య; ఓకే ద్యాంక్యూ సో మ‌చ్.




   

మరింత సమాచారం తెలుసుకోండి: