గోల్డెన్ లెగ్ హీరోయిన్ శ్రుతిహాసన్ నోటి వెంబటి బూతు డైలాగ్స్ వచ్చాయంటే నమ్మగలమా కానీ శ్రుతి బూతులు పలికింది. ‘డి-డే’ సినిమాలో శ్రుతి పాకిస్తాని వేశ్యగా నటిస్తోంది. అన్న విషయం తెలిసిందే, ఈ చిత్రంలో శ్రుతి తన పాత్రకు తగిన విధంగా బూతు డైలాగులు చెప్పింది. ఈ డైలాగ్స్ విన్న సెన్సార్ బోర్డు సభ్యులు షాక్ కు గురై ఇందులోని చాలా బూతు డైలాగ్స్ కు కత్తిర వేసి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ముంబాయ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు.

ఈ సినిమాలో డేరింగ్ అండ్ డేషింగ్ గా నటించిన శ్రుతిహాసన్ హాట్ స్టిల్స్ ఇప్పటికే సంచలనాన్ని సృస్టిస్తున్నాయి. జూలై 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. మరోవైపు ఈ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా శ్రుతిహాసన్ ప్రభుదేవా దర్శకత్వంలో నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా కూడా అదేరోజు విడుదలవుతోంది. ఒక సినిమా ప్రేమ కధ అయితే మరొకటి బూతులతో కూడిన వేశ్య పాత్ర. ఈ విధంగా ఒకేరోజు ఒకే హీరోయిన్ నటించిన రెండు విభిన్నమైన పాత్రలతో కూడిన సినిమాలు విడుదల కావడం చాలా అరుదైన రికార్డు.

ఆ రికార్డును కూడా శ్రుతి సొంతం చేసుకుంది. ఇంతకీ బాలీవుడ్ ప్రేక్షకులు శ్రుతి నటించిన బూతు సినిమాను ఆదరిస్తారా లేక ప్రేమ సినిమాకు ఓటు వేస్తారా లేదా రెండిటికి ఓటు వేస్తారా అన్నది శ్రుతి అదృష్టం పై ఆదారపడి ఉన్నది...

మరింత సమాచారం తెలుసుకోండి: