రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బాహుబలి చిత్రంలోని పాత్రలను అపురూపంగా సృష్టించారు. ఆ పాత్రల్లో నటించిన నటులు కాకుండా ఆ పాత్రలేక వ్యక్తిత్వం సృజియించడంతో అవి బాగా ప్రజల్లోకి వెళ్లాయి. బాహుబలి, భల్లాలదేవ, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక.. ఇలా ఏ పాత్రకు ఆ పాత్ర మన కళ్లముందు కదలాడుతాయి. 

Image result for sivagami
పేరుకు బాహుబలి, భల్లాలదేవ నాయక ప్రతినాయకులైనా శివగామి, కట్టప్ప పాత్రలు వాటికి తీసిపోవు. అందులోనూ శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ జీవించడంతో ఆ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. శివగామి రాజమాతగా.. కట్టప్ప ఆమె కట్టుబానిసగా.. ఆమె మాట శాసనంగా పాటించే అనుచరుడుగా ప్రేక్షకుల్లో ముద్ర వేసుకున్నారు. 

Image result for kattappa
ఈ పాత్రలపై సోషల్ మీడియాలోనూ ఎన్నో పేరడీలు వచ్చాయి. అయితే అలాంటి కట్టప్ప శివగామితో రొమాన్స్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కట్టప్పఏంటి.. శివగామితో సరసం ఏంటీ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఐతే.. వాస్తవానికి ఈ వీడియోకూ బాహుబలి సినిమాకు ఏమాత్రం సంబంధం లేదు. 



ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో ర‌మ్య‌కృష్ణ, స‌త్య‌రాజ్‌ న‌టించారు. కట్టప్ప ఓ రాజుగా రమ్యకృష్ణ రాణిగా నటించిన ఈ యాడ్ ఓ టెక్స్‌టైల్ బ్రాండ్ కోసం రూపొందించారు. దేశ‌మంతా బాహుబ‌లి మానియాలో ఉన్న ఈ స‌మ‌యంలో ఈ ఇద్ద‌రి యాడ్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. సోషల్ మీడియాలో వీడియో వైర‌ల్ అయింది. మీరూ చూసి ఆనందించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: