బాహుబలి ఇప్పుడు  ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా. వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న చిత్రం.  ఓ తెలుగు సినిమా భాషాబేధాలు లేకుండా దేశమంతటా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి ప్రభంజనాన్ని ముందే ఊహించిన పలు నిర్మాతలు బాహుబలి 2 విడుదల సమయంలో తమ సినిమాలు విడుదల చేసేందుకు సాహసం చేయలేకపోయారు. 

Image result for bahubali 2 tamil audio launch pics

ఇటు తెలుగులోనూ.. అటు హిందీలోనూ ప్రధాన చిత్రాలేమీ పోటీలేకపోవడంతో బాహుబలి వసూళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది. ఇంతటి బాహుబలి సునామీని కూడా తట్టుకుని తమిళంలో ఓ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అదే పవర్‌ పాండి చిత్రం.

Image result for power pandi

పవర్ పాండి చిత్రాన్ని హీరో ధనుష్  సొంత దర్శకత్వంలో నటించి నిర్మించారు. బాహుబలి విడుదలకు దాదాపు రెండు వారాల ముందే ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత బాహుబలి 2 తమిళ చిత్రం విడుదలైనా ధనుష్ సినిమా వసూళ్లు మాత్రం నిలకడగానే ఉన్నాయట. 

Image result for power pandi

ఈ సినిమా ఘన విజయంతో ఇప్పుడు ధనుష్ దీని సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సో.. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించేందుకు సిద్ధంగానే ఉంటారని మరోసారి రుజువైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: