ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓకే ఒక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.  దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా  దర్శకత్వం వహించిన చిత్రం  ‘బాహుబలి2’. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా వెయ్యి కోట్లు వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది.  భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.  
Image result for baabubali2
ఈ చిత్రం చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వారే కాకుండా రాజకీయ,వ్యాపారవేత్తలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ సినియర్ హీరో రిషికపూర్ రిలీజైన ప‌ది రోజుల త‌ర్వాత‌ ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాన్ని ముంబైలో వీక్షించారు.  ఈ సినిమా ఎక్కడ షూట్ చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నా. అక్కడ నాకో 2 బెడ్ రూం ఫ్లాట్ కావాలి. ఎవరైనా ఏజంట్ ఉన్నారా?” అని ట్వీట్ చేశాడు.  
Image result for baabubali2
అంతే కాదు సినిమా చాలా అద్భుతంగా ఉందని భారత దేశ సినిమా రంగానికి పెద్ద పండగొచ్చిందని..ఈ సినిమా వసూళ్లను చేరేందుకు మిగతా హీరోలు ఎంతో కష్టపడాలని ట్విట్ చేశారు.  ప్రస్తుతం బాహుబలి 2 వెయ్యి కోట్లు వసూళ్లు చేసి మును ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: