తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.  తర్వాత డార్లిం, మిర్చి లాంటి సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు.  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి2 చిత్రం మానియా నడుస్తుంది.  
Image result for baahubali 2 posters
అయితే బాహుబలి చిత్రం ప్రాజెక్టు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది..అయితే ఈ చిత్రంలో నటించిన ప్రబాస్ ఈ ఐదు సంవత్సరాలు ఇతర చిత్రాల్లో నటించకుండా కేవలం తన టైమ్ మొత్తం బాహుబలికే కేటాయించాడు.  తాను పడ్డ కష్టానికి అద్భుతమైన ఫలితం దక్కింది..ఏకంగా జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యావత్ భారత దేశం తెలుగు హీరో ప్రభాస్ ని ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే..ఓ బాలీవుడ్ దర్శకుడి మాత్రం  ప్రభాస్ పై పెదవి విరిచాడు.

బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ క్రెడిట్ ఏమాత్రం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా విజయానికి కేవలం కథ, దర్శకత్వం మాత్రమే కారణమని ఆయన తెగేసి చెప్పాడు.  అంతే కాదు ఇందులో నటించిన నటీనటులందరూ సినిమా ఘన విజయం సాధించడానికి కొంత వరకు ఉపయోగపడ్డారే తప్ప... ఇంకేం లేదని అన్నాడు. అయితే, అవకాశం వస్తే మాత్రం ప్రభాస్ హీరోగా సినిమా తీస్తానని చెప్పాడం కొసమెరుపు. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: