సినిమాలో ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూ వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన అద్భుత గ్రాఫిక్స్ చిత్రం ‘బాహుబలి 2’.  దర్శకధీరుడు రాజమౌళి సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీల రూపు రేఖలనే మార్చాయి.  ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి మానియా నడుస్తుంది.  ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న రికార్డులు కూడా బ్రేక్ చేసి మొట్ట మొదటి సారిగా వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన భారీ చిత్రంగా రికార్డు నమోదు చేసుకుంది.  
Image result for bahubali 2 shahrukh khan
ఇక ఈ చిత్రం కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేయాలంటే ఎంత పెద్ద స్టార్ కావాలో..ఏ రెంజ్ లో సినిమా ఉండాలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఎన్నో ప్రశంసల జల్లు కురిపించారు.  తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నోరు విప్పాడు.  ముంబయిలోని ఓ మాల్ లో ఐనాక్స్ ఇన్ సిగ్నియా థియేటర్స్ ను ప్రారంభించారు. అనంతరం, షారూక్ మాట్లాడుతూ, తాను చిన్న వయసులో ఉన్నప్పుడు మంచి చిత్రాలు విడుదలయ్యేవని, కానీ, మంచి థియేటర్లు మాత్రం ఉండేవి కాదని అన్నారు.  
Image result for bahubali 2
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తి గా మారి పోయాయి.. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఎన్నో మంచి థియేటర్లు అందుబాటుకి వచ్చాయి.  అలాంటి సమయంలో సినిమాలు కూడా ఆ రేంజ్ లో తీస్తేనే బాగుంటుందని నా అభిప్రాయమన్నాడు. అంతే కాదు మిగిలిన థియేటర్లలో కన్నా ఈ తరహా థియేటర్లలో ‘బాహుబలి’ వంటి అద్భుతమైన చిత్రాలను చూస్తే చాలా బాగుంటాయని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: