తెలుగు ఇండస్ట్రీలో కృష్ణం రాజు నట వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు.  దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి, బాహుబలి 2’ తో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించారు. అంతే కాదు భారత దేశంలో 1000 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో ఇప్పుడు  జాతీయ స్థాయిలో బాహుబలి  (ప్రభాస్) పేరు మారు మోగుతుంది.  ఇంకేముంది మనోడి వెంట కార్పోరేట్ సంస్థలు కూడా క్యూ కట్టాయి.  
Image result for prabhas mahindra ad
ఆ మద్య బాహుబలి చిత్రం తర్వాత మహేంద్ర మోటర్స్ యాడ్ లో నటించాడు.  తర్వాత మరికొన్ని చాన్సులు వచ్చినా బాహుబలి 2 కోసం అవన్నీ కాదనుకున్నాడు.  తాజాగా ప్రభాస్ కమర్షియల్ యాడ్ లో నటిస్తే 18 కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ తృణ ప్రాయంగా ఆ ఆఫర్ ని వదులుకున్నాడు.   గతంలో కూడా బాహుబలి షూటింగ్ సమయంలో పది కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ అప్పట్లో కూడా ఆ ఆఫర్ ని తిరస్కరించాడు.  అయితే ఓ కమర్షియల్ యాడ్ లో నటిస్తే ప్రభాస్ కి ఏకంగా 18 కోట్లు ఇస్తామన్నా అబ్బే ఇప్పుడు కుదరదు అని చెప్పాడట.  
Related image
ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి ప్రభంజనం సృష్టిస్తోంది . ఇక ప్రభాస్ ఏమో అయిదేళ్ల పాటు శ్రమించాడు కాబట్టి అమెరికా వెళ్లి సేద తీరుతున్నాడు.  వాస్తవానికి ప్రభాస్ కి ఉన్న రేంజ్ కి ఇప్పుడు ఎన్నో యాడ్స్ లో నటించి డబ్బులు సంపాదించేవారని కానీ ప్రభాస్ మాత్రం నో అని చెప్పడం ఏంటీ అని అందరూ ఆశ్చర్య పోతున్నారు .  ప్రస్తుతం ఎంజాయ్ మెంట్ ట్రిప్ లో ఉన్నాడు..తిరిగి హైదరాబాద్ వచ్చాక యాడ్ లు చేయాలా ? లేదా మరోసారి అలోచించి డిసైడ్ చేసుకుంటాడట .


మరింత సమాచారం తెలుసుకోండి: