నేటివిటికీ, నాచురాలిటికీ ద‌గ్గర‌గా సినిమాలు చేసే డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. ఒక గోదావ‌రి, ఒక హ్యాపిడేస్, దాదాపు ఆయ‌న ప్రతి సినిమా ఎ క్లాస్ ఆడియెన్స్ ని క‌ట్టి పడేశాయి. అయితే ఆ మ‌ద్య వ‌చ్చిన    లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్  శేఖ‌ర్ క‌మ్ముల అభిమానులను చాలా నిరాశ‌ ప‌రిచింది. దీంతో ఈ క్రియేట‌ర్ విద్యాబాల‌న్ న‌టించిన హిందీ చిత్రం క‌హానిని  తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనామికగా రీమేక్ చేస్తున్నాడు.
��
నాటీగ‌ర్ల్ న‌య‌న‌తార న‌టిస్తున్న  ఈ మిస్సింగ్ మిస్టరీ స్టోరిని ఎన్ డిమోల్ సంస్ధ నిర్మిస్తుంది. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి త‌న‌యుడు వైభ‌వ్ కూడా ఓ ప్రదాన పాత్ర చేస్తున్నాడు. కీర‌వాణి మ్యూజిక్ అందిస్తుండ‌టంతో అనామిక‌కు మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్షన్. ఇక శేఖ‌ర్ క‌మ్ముల రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా రూపొందుతున్న ఈ మూవీకి ప్రముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్రనాధ్ డైలాగ్స్ రాస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీని ద‌స‌రాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని శేఖ‌ర్ క‌మ్ముల అంటున్నారు. మ‌రి ద‌స‌రా బ‌రిలో శేఖ‌ర్ క‌మ్ముల అనామిక ఎంతగా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: