ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టిస్తున్న చిత్రం ‘బాహుబలి 2’.  మొదటి పార్ట్ బాహుబలి భారత దేశ సినిమా చరిత్రంలో కొత్త అధ్యాయం సృష్టించగా ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ఏకంగా భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని కొత్త రికార్డు సృస్టించింది.  వెయ్యి కోట్లు వసూళ్లు చేసి భారత దేశంలో మొట్టమొదటి అత్యధికంగా కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.  ఈ చిత్రం రిజీల్ టైమ్ లో పెద్ద హీరోల చిత్రం పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి నెలకొందీ అంటే సినిమా స్టామినా ఏంటో ముందుగానే గుర్తించారని లెక్క.  
Image result for baahubali 2
ఏప్రిల్ 28న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది .  వెయ్యి కోట్లని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించగా తాజాగా ఆ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించి ఎవరూ అందుకోలేని దిశగా దూసుకుపోతోంది .  
Image result for baahubali 2
దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టానికి వెయ్యిరెట్లు ప్రతిఫలం దక్కింది.  ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించారు. దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్ల ని ఒక్క భారత్ లోనే వసూల్ చేసింది బాహుబలి 2 , అలాగే ఓవర్ సీస్ లో కూడా 240 కోట్ల వసూళ్ల ని సాధించింది . మొత్తంగా 1300 కోట్ల కు పైగా వసూల్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: