పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు లకు ఓవర్ సీస్ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నదన్న సంగతి తెలిసిందే. వీరి సినిమాలు కూడా ఓవర్ సీస్ లో కోటానుకోట్ల కలెక్షన్స్ ను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ఇద్దరి టాప్ హీరోల క్రేజ్ విపరీతంగా ఉండడంతో అమెరికాలోని నాట్స్, నాటా, తానా వంటి సంస్థలు వారి ప్రత్యేక ఈవెంట్స్ కు పవన్ ను కాని మహేష్ ను కానీ పిలుద్దామని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

సామాన్యంగా వారి సమావేశాలకు ఒక టాప్ తెలుగు సెలబ్రిటీని పిలిచి నిర్వహించడం వల్ల ఆ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు ఫండ్ రైజింగ్ కూడా పనికివస్తుందన్న ఉద్దేశంతో మన టాలీవుడ్ కు చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిస్తూ ఉంటారు. ఈ తరహాలోనే పవన్ ని కాని మహేష్ బాబు ని కాని భవిష్యత్ లో జరగబోయే వారి ఈవెంట్స్ కు పిలుద్దామని ఇప్పటినుంచే ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారట. కాని అటు మహేష్ కు కాని ఇటు పవన్ కి కాని పెద్దగా సోషల్ ఈవెంట్స్ కు వచ్చే అలవాటు లేదు. వారి ద్రుష్టి అంతా వారు నటిస్తున్న సినిమాల వైపు, మిగతా సమయం వారి కుటుంబ సభ్యులతో,స్నేహితులతోనే కాలం గడుపుతూ ఉంటారు. సాధారణంగా బయటకు రారు. సభలు, సమావేశాలు అంటే వీరిద్దరూ ఆమడ దూరంలో ఉంటారు.

అందువల్ల అమెరికాలోని మన తెలుగు సంస్థలు ఎంత ప్రయత్నించినా వీరి డేట్స్ దొరకడం లేదట. ఇక లాభం లేదు అనుకోని, పవన్ కాని మహేష్ కాని అమెరికాలో జరిగే వారి సంస్థల ఈవెంట్స్ కు అతిధులుగా వస్తే రెండు కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఆఫర్ చెయ్యడానికి అమెరికాలోని తెలుగు సంఘాలు నిశ్చయించుకొని ఒకరిపై ఒకరు పోటి గా మహేష్, పవన్ ల డేట్స్ గురించి తిరుగుతున్నారట. మరి దీనికి మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్, మహేష్ లు ఏమంటారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: