నాగ్...........డిఫ‌రెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రస్. అంతేనా మంచి బిజినెస్ మేన్ కూడా. నిజం చెప్పాలంటే  తెలుగు హీరో్ల్లో ఎవ‌రికీ లేని ఆస్తులు వున్నాయి యువ సామ్రాట్ కి.  రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో నాగ్ రియ‌ల్ ఎస్టేట్ కింగ్. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు మా టీవితో బాగా సంపాదిస్తున్న నాగ్ మార్కెటింగ్ స్ట్రాట‌జీకి ఎవ్వరికీ అంతుప‌ట్టదు. అవ‌న్ని తెలుసుకోవాలంటే నాగ్ లోని మరో యాంగిల్ ని త‌ప్పక తెలుసుకోవాల్సిందే.

నాగార్జున తండ్రి అదేనండి మ‌న అక్కినేని నాగేశ్వరావుగారు ..  అన్నపూర్ణ బ్యాన‌ర్ ని స్ధాపించి  అప్పట్లో  కొన్ని సినిమాలు చేశారు. సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అనుకోండి. కానీ ఎప్పుడైతే నాగ్ బాద్యత‌లు తీసుకున్నాడో ఆ రోజు నుండే అన్నపూర్ణ స్టూడియో స్వరూపం, అన్నపూర్ణ బ్యాన‌ర్ రేంజ్ పెరిగిపోయాయి. ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా ర‌న్ చేస్తున్నారు నాగ్. హైద‌రాబాద్ లో పెద్దగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ లేవు కాబ‌ట్టి అన్నపూర్ణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి యూత్ ఎగ‌బ‌డ‌టంతో ల‌క్షల్లో డ‌బ్బులు వ‌స్తోంది. ఆ విష‌యం ప‌క్కన పెడితే నాగ్ ఎంత మ‌నీ మైండెడ్ ప‌ర్సన్ తెలియాలంటే ఆటోన‌గ‌ర్ సూర్య  సినిమా విష‌యాన్ని చూస్తే అర్దమ‌వుతోంది.
��
నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య న‌టించిన ఈ సినిమాను చంద్రశేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేశారు. ఆర్.ఆర్. మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో రూపొందించారు. కానీ డ‌మ‌రుకం టైంలో న‌ష్టాల పాలైన ఈ సంస్ధ ఆటోన‌గ‌ర్ ని రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు. మ‌రి త‌న‌యుడి సినిమానే క‌దా..? ఓ చేయి వేసి రిలీజ్ చేయోచ్చుగా అంటే ప్లాప్ అయితే డ‌బ్బులు బొక్కా అంటారట నాగ్. మ‌రి ఇంత‌కీ  ఇప్పుడు ఈ క‌ధంతా ఎందుకు చెప్తున్నార‌బ్బా అని మీ డౌటు. ఓకే ఆ విష‌యానికే వ‌స్తున్నా. ప్రజెంట్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై భాయ్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. పూల‌రంగ‌డు ఫేం వీర‌భ‌ద్రం డైరెక్టర్. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాను శాటిలైట్ రైట్స్ ను జీటివికి అమ్మేశారు నాగ్.

జ‌న‌రల్ గా నాగ్ సినిమా అంటే  సొంత ఛాన‌ల్ మా వుంది కాబ‌ట్టి రైట్స్ వుంచేసుకుంటారు. కానీ భాయ్ శాటిలైట్ రైట్స్ జీటివి 6 కోట్లకు అమ్మారంటే కొంచెం ఆలోచించాల్సిన విష‌య‌మేక‌దా.? ఆ ధింక్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే సినిమా బాగోలేద‌నుకోండి సొంత బ్యాన‌ర్ క‌దా ....లాస్ ఎవ‌రు భ‌రిస్తార‌ని నాగ్ ఆలోచ‌నట‌. అందుకే నాగ్ భాయ్ రైట్స్ ని జీటివికి అంట‌గ‌ట్టేసి ఆరు కోట్లు అందుకున్నారు. మ‌రో విష‌యం ఇది నాగ్ కెరీర్ లో నే టాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: