కాపీ కొట్టడం మారైట్‌... అంటోంది ఈత‌రం. సినిమా వాళ్లయితే మ‌రీనూ. ఈమ‌ధ్య నాలుగైదు హిట్ సినిమాలు క‌ల‌గ‌లిపి ఇంకో సినిమా తీసేస్తున్నారు. అవి కూడా హిట్లయిపోతున్నాయి. అందుకే కాపీ కొట్టడంలోనే హిట్టు కిటుకు దాగుంది అని న‌మ్ముతున్నారు. యాక్షన్ హీరో గోపీచంద్ కూడా ఇదేమాట అంటున్నాడు.


కాపీ కొట్టడం త‌ప్పుకాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఓ విష‌యంలో స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా సినిమా వాళ్లు. మేం ఎప్పుడూ ఎవ‌రినీ కాపీ కొట్టలేదు.... అంటే అబ‌ద్ధం చెబుతున్నట్టే. ఇంగ్లీష్ సినిమాలు, కొరియ‌న్ సినిమాలు త‌ప్పకుండా స్ఫూర్తి ఇస్తాయి. అయితే వాటిని తెలుగు వాతావ‌ర‌ణానికి అనుగుణంగా మార్చుకొని చూపించే నేర్పు ఉండాలి. అలాంటి సినిమాలే ఆడ‌తాయి.. అంటున్నాడు గోపీచంద్‌.

గోపీచంద్ న‌టించిన సాహసం కూడా కొన్ని బాలీవుడ్ చిత్రాల‌కు స్ఫూర్తేన‌ట‌. మ‌రి అవేంటో మాత్రం చెప్పలేదు. చెబితే ఆ బాలీవుడ్ సినిమాలే చూస్తారు, సాహ‌సాన్ని లైట్ తీసుకొంటారు అనే భ‌యం ఏమో...?

మరింత సమాచారం తెలుసుకోండి: