దేశ వ్యాప్తంగా అతిపెద్ద సెన్సేషన్ గా మారింది బాహుబలి చిత్రం. తిరుగులేని రికార్డులు సాధిస్తున్న ఈ సినిమా వెయ్యి కోట్లు , పదిహేను వందల కోట్లు గ్రాస్ కలక్షన్ ల తో సునామీ సృష్టిస్తోంది ఈ చిత్రం ఒకరికి మాత్రం అంతగా నచ్చలేదు .. బాహుబలి లాంటి సినిమా చేస్తారా అంటూ కమల్ హాసన్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.


దీనికి 'నేనేమీ గొర్రెను కాదు.. ఎట్ లీస్ట్ గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతికి చెందిన జంతువుని. బాహుబలి హిట్ అయింది కాబట్టి.. అలాంటి సినిమా నేను కూడా తీస్తా అనే రకం కాదు నేను' అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కమల్.



నట విశ్వరూపం చూపించే కమల్ హాసన్.. ఇంత సీరియస్ అయేందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ చేతిలో పెట్టుకుని అప్పుడు ఆయా కేరక్టర్లను రకరకాలుగా తీర్చిదిద్దిన సినిమా బాహుబలి. కానీ ఎన్నో పాత్రలను ఏ సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే చేసి.. మెప్పించిన మహా నటుడు కమల్ హాసన్. 62 సంవత్సరాల వయసులోనూ ఇంకా కొత్తదనం కోసం.. కొత్తగా నటించేందుకు తపించే గొప్ప యాక్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: