ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హిస్టారికల్ చిత్రాలు తీసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.  బాలీవుడ్ లో అయితే ఇలాంటి చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  తెలుగు ఇండస్ట్రీలో కూడా రుద్రమదేవి, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్యంలో ఉన్న చిత్రాలు వచ్చాయి.  అయితే చారిత్రక నేపథ్యం అనగానే చాలా మంది చూడాలన్న చూడాలి..తెలుసుకోవాలీ అన్న క్యూరియాసిటి కలుగుతుంది.  ఈ నేపథ్యంలో తెలరెక్కుతుంది మరో చారిత్రాత్మక చిత్రం ‘మణికర్ణిక ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.
Image result for krish manikarnika
 గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రధాన పాత్రలో బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ నటిస్తుంది.  అంతా బాగుంది కానీ ఇప్పుడు కంగన ఓ వివాదంలో చిక్కుకుంది.  బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెకు కేతన్ మెహతా లీగల్ నోటీసులు పంపాడు.  అసలు విషయానికి వస్తే... కేతన్ మెహతా తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘రాణి ఆఫ్‌ జాన్సీ.. ది వారియర్‌ క్వీన్‌’లో నటిస్తానని చెప్పిందట..తీరా చూస్తే క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ వైపు మొగ్గుచూపడంతో తన ప్రాజెక్టును హైజాక్‌ చేసిందంటూ నోటీసుల్లో ప్రస్తావించాడు.
Image result for krish manikarnika
కంగనాకు నోటీసు పంపామని, ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాడు నిర్మాత. ఈ విషయాన్ని తాము చట్టబద్ధంగా ఎదుర్కోవాలని నిర్ణయించి నోటీసు ఇచ్చినట్టు మెహతా వెల్లడించాడు.  అంతే కాదు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్న చిత్రాన్ని మరొకరు చేయడం..అందులోనూ తాను ఎంచుకున్న నటి ఆ ప్రాజెక్టు లో పనిచేయడం చేయడం విశ్వాస ఘాతుకమేనని, ఈ విషయాన్ని అంతతేలికగా వదిలిపెట్టబోమని స్పష్టంచేశాడు. దీనిపై కంగనా ఏమంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: