ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లో సినిమాలు వస్తే అవి సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు.  ఇలాంటి కాంబినేషన్ కొరటాల శివ, మహేష్, ఎన్టీఆర్.. పవన్ కళ్యాన్, త్రివిక్రమ్..బోయపాటి శ్రీను, బాలకృష్ణ.  ఇలాంటి కాంబినేషన్ లో సినిమాలు వస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతాయి అని ఫ్యాన్స్ అంటున్నారు.  ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.  సెలబ్రెటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  
Image result for ntr birthday date
అయితే ఫ్యాన్స్ కి ఈ సందర్భంగా ఓ శుభవార్త షేర్ చేసుకున్నారు..ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు.  గత సంవత్సరం రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ ఇంకా ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ వార్త ఎంతో సంతోషాన్ని నింపింది.  యువ‌సుధ‌ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మిక్క‌లినేని సుధాక‌ర్ మాట్లాడుతూ ``ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను.
Image result for ntr koratala
ఆ అనుభవం తో నిర్మాత గా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించ‌డం మరియు ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందం గా ఉంది.ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. మిగిలిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం`` అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: