యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా జై లవ కుశ.. బాబి డైరక్షన్లో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో సంకెళ్లతో ఎన్.టి.ఆర్ కనిపించడం ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇచ్చింది. సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ ఫస్ట్ లుక్ లో క్యారక్టర్ ఏదై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.  


సినిమాలో జై కుమార్, లవకుమార్, కుశాల్ గా మూడు పాత్రల్లో నటిస్తున్న తారక్ ఫస్ట్ లుక్ నెగటివ్ రోల్ చేసే జై అని అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రావణుడు  బ్యాక్ గ్రౌండ్ లో ఉండేలా అభివాదం చేస్తున్న తారక్ సినిమాలో ఆ పాత్ర యొక్క ఇంటెన్స్ ను చూపించాడు. జై క్యారక్టర్ మీద సినిమా మొత్తం నడుస్తుందట.  


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచిన తారక్ సినిమాతో మరో సూపర్ హిట్ గ్యారెంటీ అన్నట్టే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబి చేస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: