మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఓ బిడ్డకు తల్లయినా ఇంకా తన అందచందాలతో మతి పోగొడుతూనే ఉంది. తాజాగా నలభైమూడేళ్ల ఈ ప్రపంచ సుందరి.. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సిండ్రెల్లా డ్రస్సుతో అదరగొట్టేసింది.




ఈ సిండ్రెల్లా డ్రెస్‌ తో ఐష్‌ అందాలు ఒలికిస్తూ ఇచ్చిన ఫోజులు సౌందర్య ప్రియుల మతి పోగొడుతున్నాయి. 


ఇంతకీ ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది ఎవరో చెప్పలేదు కదూ.. ఆమే దుబాయ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్‌ మైఖేల్‌ సింకో. ఐశ్ ను ఈ డ్రెస్సులో చూసిన సదరు డిజైనర్ ఉప్పొంగిపోయిందట.



ఈ డిజైన్ తో తన జన్మ ధన్యమైపోయిందని ఆమె కామెంట్ చేసిందంటే ఆ డ్రెస్ ఐశ్వర్యకు ఎంతగా సూటైందో మీరే ఆలోచించండి. 



ఆమె ఇంకా ఏమందంటే.. ప్రపంచంలోని గొప్ప అందెగత్తెల్లో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది. నేను డిజైన్‌ ఫిట్‌లో ఆ అందాలరాశి నడిచిరావడం చూసి నా జన్మధన్యమైంది అంటూ డిజైనర్‌ సిన్కో కామెంట్ చేశారు.



ఐశ్వర్య ప్రఖ్యాత ఫ్రెంచ్‌ కాస్మోటిక్‌ కంపెనీ ‘లోరియల్‌‌’కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోంది. ఈ డ్రెస్ కూడా ఆ కంపెనీ ప్రమోషన్ కోసం వేసుకున్నదే. 



మరింత సమాచారం తెలుసుకోండి: