తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్లలో ఒకరు సుకుమార్.  ఈయన తీసిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి.  భారీ బడ్జెట్ తో ఎక్కడా కూడా తగ్గకుండా హీరోని అద్భుతంగా చూపిస్తూ సుకుమార్ తీసే సినిమాలంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీ హీరోలకు విపరీతమైన క్రేజ్. ఆ మద్య ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ లో చాలా డిఫరెంట్ స్టైలిష్ లుకింగ్ తో ప్రజెంట్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.  ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో  సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.  
Image result for rao ramesh
ఈ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది..కాగా ఇప్పుడు సుకుమార్ పై ఓ నటుడుతో గొడవ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో సమంత తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నాడు కాగా ఇప్పుడు అతడిని తప్పించారని అతడి స్థానంలో ప్రకాష్ రాజ్ నటించనున్నట్లు తెలుస్తోంది.   కాకపోతే అప్పటికే రావు రమేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తుంది.
Image result for sukumar ram charan new film
అయితే దీనికి కారణం  కొన్ని సన్నివేశాల్లో మళ్ళీ మళ్ళీ రీ టేక్ లు కోరడంతో రావు రమేష్ సహనం నశించి పోయిందట దాంతో ఇక ఓపిక పట్టలేక కావాలనే అవమానిస్తున్నాడని భావించి లొకేషన్ నుండి వెళ్ళిపోయాడట రావు రమేష్.  ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ఉందని తన నటనకు ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తారని అలాంటి తన నటనకే వంకలు పెడతూ ఇన్ని సార్లు టేక్ తీసుకోవడం ఏంటీ అని రావు రమేష్ వాదన.  
Related image
దీనిపై దర్శకుడికి, నిర్మాతలకు కూడా కోపం రావడంతో  ప్రకాష్ రాజ్ ని సంప్రదించారట . ఇంకేముంది ప్రకాష్ రాజ్ వెంటనే ఒప్పేసుకున్నాడు . అంటే రావు రమేష్ స్థానం లో ప్రకాష్ రాజ్ నటించనున్నాడన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: