సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. తెలుగులో మాత్రం పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అన్నంత క్రేజ్ ఉంటుంది. ఛాన్స్ దొరికితే పవన్ గురించి మాట్లాడి పవన్ ఫ్యాన్స్ మనసు గెలుచుకునే సినిమా వాళ్లు ఉన్నారు.


కాని పవర్ స్టార్ తో ఓ సినిమా చేసి తనని అవమాన పరచినట్టుగా మాట్లాడాడు దర్శకుడు కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబి ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. పేరుకి బాబి డైరక్టర్ అయినా సినిమా మొత్తం పవన్ అధ్యక్షతనే జరిగిందని తెలిసిందే.


ఇక ఫ్లాప్ వచ్చినా బాబికి పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి పొగిడాడనని కాదు కాని రీసెంట్ గా తారక్ బర్త్ డే ఎన్.టి.ఆర్ అనే టాలెంట్ కు తెలుగు రెండు రాష్ట్రాల హద్దులు సరిపోవని అన్నాడు. అంతటితో ఆగకుండా ఒక్కసారి స్టోరీ ఫైనల్ అయ్యాక ఎలాంటి విషయాల్లో కూడా తారక్ జోక్యం చేసుకోడని చెప్పాడు. సో ఈ బాబి వెల్లబెట్టిన విషయాలను చూస్తే పవర్ స్టార్ తన ప్రతి సినిమాలో తన వేలు పెట్టే కార్యక్రమం గురించి సెటైరే అంటూ రచ్చ చేయడం మొదలు పెట్టారు.


ఏ స్టార్ తో సినిమా చేస్తే ఆ స్టార్ ను ఆకాశానికెత్తేయడం దర్శకనిర్మాతలకు అలవాటే. కాని కేవలం ఆ స్టార్ ను పొగిడే క్రమంలో మిగతా స్టార్స్ ను ఉద్దేశించడం సరైన పద్ధతి కాదు. ఆ స్టార్స్ సైలెంట్ గా ఉన్నా వారి ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా చెప్పండి. సో బాబి మాటలకు ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ నుండి విమర్శలు కామెంట్లు వస్తున్నాయి. మరి వీటికి బాబి ఎలా స్పందిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: