ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఆడియో వేడుకల్లో కొన్ని సార్లు కాంట్రవర్సరీ వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  ముఖ్యంగా స్టార్ కమెడియన్ ఆలీ తన సహ యాంకర్లపై డబల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తూ ప్రతిసారీ సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు.  మొన్నటికి మొన్న రాజ్ తరుణ్ ని స్టేజి పైకి పిలిచేందుకు యాంకర్ అనసూయ వెళ్లగా ఎవరు పిలిస్తే వారికోసం వెళ్తావా అంటూ వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనం సృష్టించాడు.  ఇలాంటి సంఘటనలు బుల్లితెరపై, స్టేష్ షోల్లో, ప్రైవేటు కార్యక్రమాల్లో జరుగుతూనే ఉన్నాయి.  
Image result for rarandoi veduka chuddam
తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌లో నటుడు చలపతిరావు చేసిన కామెంట్స్‌ పెను దుమారం చెలరేగింది.  దీనిపై ఆయన పలు ఓ ప్రముఖ చానల్ లో క్షమాపణలు కోరారు.  అయితే ఇప్పుడు ఈ కథ మరో మలుపు తిరిగింది..నటుడు చలపతిరావు అమ్మాయిలపై చేసిన కామెంట్ సందర్భంగా పలువురు నటులు మొఖం చాటేసుకున్నారు.
Image result for rarandoi veduka chuddam audio release
కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై పక్కనేవున్న హీరో నాగచైతన్య నవ్వుతూ కనిపించాడు. దీంతో ఆయనపై కూడా సోషల్‌మీడియాలో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  సినిమా హీరో అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలని హుందాగా వ్యవహరించాలని కానీ నాగ చైతన్య మాత్రం ముసి ముసి నవ్వలు నవ్వడం ఏంత వరకు న్యాయం అని అంటున్నారు.  వీటిని ఖండించాల్సిపోయి, విరగబడి నవ్వడం ఏంటని, మహిళలంటే గౌరవం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: