‘బాహుబలి 2’ ఘన విజయంతో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తన తదుపరి సినిమాను ఏ హీరోతో ఏనిర్మాణ సంస్థతో చేస్తాడు అన్న సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కొద్ది రోజుల క్రితం చిరంజీవి రాజమౌళి ఇంటికి వెళ్లి దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపాడు అన్న వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 

ఇప్పటికే ‘బాహుబలి 2’ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ రాజమౌళి ఫై ప్రశంసలు కురిపిస్తున్న చిరంజీవి ఇప్పుడు ఇంత హడావిడిగా రాజమౌళి ఇంటికి వెళ్లి కలవడం వెనుక వ్యూహం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈవార్తలు ఇలా బయటకు రావడంతో చరణ్ తో కాని లేదంటే అల్లు అర్జున్ తో కానీ రాజమౌళి తదుపరి సినిమా ఉండేలా రాజమౌళి పై ఒత్తిడి చేయడానికి ఇలా చిరంజీవి రాజమౌళిని కలిసాడు అన్న గాసిప్పుల హడావిడి జరుగుతోంది. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి చిరంజీవిల రహస్య సమావేశం వెనుక వేరే ఎజెండా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి గ్రాఫిక్స్ విషయంలో అదేవిధంగా సెట్స్ డిజైన్ విషయంలో రాజమౌళి సలహాలను తీసుకోవడానికి చిరంజీవి ఇలా స్వయంగా రాజమౌళి ఇంటికి వెళ్ళినట్లు టాక్. 

అయితే ఈవిషయాలను చర్చించడానికి ‘ఉయ్యాలవాడ’ దర్శకుడు సురేంద్ర రెడ్డి లేకుండా కేవలం చిరంజీవి ఒక్కడే రాజమౌళి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమధ్య జరిగిన చిరంజీవి రాజమౌళిల సమావేశం వెనుక ఎదో ఒక బయటకురాని కారణం ఉంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: