యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఓంకార్ దర్శకుడిగా మారి సినిమాలను తీస్తున్నాడు. జీనియస్ సినిమా పోయినా సరే ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది సూపర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాలలో అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ గా కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో రాజు గారి గది-2 సినిమా వస్తుంది.


ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా రషెష్ చూసిన నాగార్జున కొన్ని రిపేర్లు చేయాలని సజెస్ట్ చేశాడట. అదేనండి కొన్ని చోట్ల సీన్స్ మళ్లీ రీషూట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట. సాధారణంగా ఏదైనా సినిమా రీషూట్ అంటే సినిమా మీద ఓ నెగటివ్ ఒపినియన్ వచ్చేది.


సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తో నాగ్ రిపేర్లు మంచికే అని తెలిసింది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నాగ చైతన్య రారండోయ్ వేడుక చుద్దాం సినిమాకు నాగ్ కొన్ని రీ షూట్స్ చేయించాడట. ఇవన్ని తన నిర్మాణంలో వచ్చిన సినిమాలు కాబట్టి ఓకే కాని తను లీడ్ రోల్ లో చేస్తున్న రాజు గారి గది-2 కి కూడా రీషూట్స్ సజెస్ట్ చేయడం విశేషం.


సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవని నాగ్ అది తన సినిమానా లేక వేరేదా అన్నది చూడకుండా తన ప్రమేయం ఉంటే సినిమా అవుట్ పుట్ కచ్చితంగా బాగా వచ్చేలా జాగ్రత్తపడతాడు. రాజు గారి గది-2 సక్సెస్ అయితే మాత్రం అది నాగార్జున రిపేర్ల వల్లే అని చెప్పుకోవడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: