సీనియర్ ఆర్టిస్ట్ చలపతిరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా సంఘాల మాటల దాడికి 75 సంవత్సరాల చలపతిరావు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఈ నేపధ్యంలో వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున మరో రెండురోజుల్లో విడుదల కాబోతున్న నాగచైతన్య ‘రారండోయే వేడుక చూద్దాం’ మూవీలో ఒక కీలక డైలాగ్ ను చివరి నిముషంలో చలపతిరావు మాటలకు వచ్చిన వివాదంతో భయపడి ఆ సినిమా నుండి తీసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీలో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అన్న డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ను ఈ మూవీ ట్రైలర్ లో కూడ తెగ వాడారు.  ఈ డైలాగ్ ను లీడ్ గా తీసుకొని ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు చేసిన హడావిడితోనే ఇంత వివాదం జరిగింది. 

దీనితో ఈ డైలాగ్ ను ఈమూవీ నుంచి తీసివేస్తే మంచిది అన్న ఆలోచనలలో నాగార్జున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తయింది. సరిగ్గా ఇంకో 48 గంటల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. థియేటర్లలో ఈమూవీ విడుదల అయిన తరువాత మళ్లీ ఆ డైలాగ్ వినిపిస్తే తగ్గుముఖం పడుతున్న వివాదాన్ని మళ్లీ కెలికినట్టు అవుతుందని నాగార్జున వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. 

ఇప్పటికే ఈసినిమాకు ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఉన్న నేపధ్యంలో ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఈమూవీని రిలీజ్ చేసి ఈ సమ్మర్ సీజన్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాలని నాగార్జున చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఈసినిమా పై తనకు చాల నమ్మకం ఉందని చెపుతూ నాగచైతన్య కెరియర్ కు ఈమూవీ మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి: