దర్శకుడు పూరిజగన్నాథ్ ఒకసారి సినిమా మొదలు పెడితే ఆ సినిమా యూనిట్ సభ్యులనే కాదు హీరోలను కూడ పరుగులు తీయిస్తాడు. ప్రస్తుతం బాలకృష్ణతో పోర్చుగల్ లో షూటింగ్ చేస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం పూరి పోర్చుగల్ లో ఈసినిమాకు సంబంధించి తీస్తున్న సీన్ ఇప్పటి వరకు టాలీవుడ్ స్క్రీన్ పై ఎవరు చూడలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్‌ గా అదేవిధంగా టాక్సీ డ్రైవర్ గా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనబడబోతున్న విషయం తెలిసిందే. దీనికోసం బాలయ్య గెటప్ హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అన్ని ఈసినిమాలో డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. 

ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎడ్లబండ్లు, బైక్‌, కార్‌ ఛేజింగ్‌ సీన్‌లను మాత్రమే చూసిన ప్రేక్షకులకు పూరి తన లేటెస్ట్ సినిమా ద్వారా బాలయ్య అభిమానులకు హెలికాఫ్టర్‌ ఛేజ్‌ను తొలిసారిగా చూపించబోతున్నాడు. దీనికోసం ఫ్రెంచి స్టంట్‌ మాస్టర్‌లను తీసుకువచ్చి ప్రత్యేకంగా ఈసీన్ డిజైన్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే బాలయ్య శ్రియ సన్నివేశాలకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చి అది సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఈ హెలికాఫ్టర్ చేజ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను కూడ పూరి వ్యూహాత్మకంగా లీక్ చేసి ఈ మూవీ పై మరింత అంచనాలు పెంచే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రజినీకాంత్ ‘భాష’ మహేష్ బాబు ‘బిజినెస్ మ్యాన్’ సినిమాల కథలను కలిపి ఒక కథగా తయారుచేసి బాలకృష్ణ పై పూరి ఈ ప్రయోగం చేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ పెట్టకపోవడంతో రోజుకు ఒక ఊహాజనితమైన టైటిల్ మీడియాకు లీక్ అవుతూ బాలయ్య అభిమానులనే కాదు బాలకృష్ణను కూడ ఖంగారు పెట్టిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: