తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది అందాల భామ శృతిహాసన్.  స్వతహాగా సింగర్, మ్యుజీషన్ అయిన శృతి హాసన్ నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది.  తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  అయితే మొదటి నుంచి శృతి హాసన్ కాస్త దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి అందుకే ఈ అమ్మడు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ చెప్పినట్లు స్వయంగా తెలిపింది.    
Image result for shruthi hassan
ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలు పంచుకుంది. కెరియర్ ప్రారంభంలో తాను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రేమించానని, అయితే తరువాత అతని మీద తనకు వున్న ఫీలింగ్ ప్రేమ కాదని తెలిసిన తర్వాత అతనితో విడిపోయానని చెప్పింది. ప్రస్తుతం మాత్రం తాను ఎవరితో లవ్ లో లేనని, ప్రేమించే టైం కూడా ఇప్పుడు తనకు లేదని తేల్చి చెప్పింది, అయితే ఎవరినైనా ప్రేమిస్తే తనని పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడానికి తాను రెడీ అని ఈ విషయం తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పేసింది.
Image result for shruthi hassan
శృతి హాసన్ అంటే మరీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానంటూ ప్రకటన చేయడం మాత్రం దారుణం అంటూ ఆశ్చర్య పోతున్నారు జనాలు .  అయితే శ్రుతి హాసన్ మనసు దోచిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరై ఉంటారా అని అందరు తెలుసుకునే పనిలో వున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: