తెలుగు ఇండస్ట్రీలో కామెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు గా మారిన వారు చాలా మంది ఉన్నారు.  తమ కెరీర్ లో ఓ వైపు హాస్యనటులుగా నటిస్తూనే హీరోలుగా నటించి మెప్పించిన వారు రాజబాబు, పద్మనాభం, చలం, బ్రహ్మానందం, ఆలి లాంటి వారు ఉన్నారు.  అయితే కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అందాల రాముడు, మర్యాద రామన్న ఇలా వరుస హిట్స్ తో దూసుకు వెళ్లాడు.  తర్వాత మనోడికి గడ్డు పరిస్థితులు ఏదురయ్యాయి.  తీసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా సునీల్ కెరీర్ ప్రశ్నార్థకం అయ్యింది.  
Image result for ungarala rambabu
ఆ మద్య వచ్చిన జక్కన్న కాస్త పరవాలేదు అనిపించింది.  ప్రస్తుతం సునీల్ హీరోగా నటించిన ” ఉంగరాల రాంబాబు ” సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . పరుచూరి శివరామ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చక్కటి చిత్రాలు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు .  ఈ సినిమాపై సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  
Image result for ungarala rambabu
అయితే  సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది కానీ సునీల్ కు హిట్ లేకపోవడంతో ఒక్క బయ్యర్ కూడా సినిమాని కొనడానికి ముందుకు రావడం లేదు . దాంతో బయ్యర్స్ వస్తేనే సినిమా రిలీజ్ చేయగలనని లేదంటే నష్టపోవడం ఖాయమని , అంతటి రిస్క్ తీసుకోలేనని బయ్యర్ల కోసమే ఎదురు చూస్తున్నాడు నిర్మాత .  మరి బయర్లు వచ్చేదెపుడో ఈ సినిమాకు మోక్షం ఎపుడో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: