Image result for bahubali vs dangal box office collection


చైనాలో ఇప్పటికే కొత్త చరిత్ర సృష్టించింది మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సినిమా  దంగల్.  ఇప్పటివరకు ఇండియా మరియు విదేశాల్లో 700 కోట్ల రూపాయలు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు చైనాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. మే 5 న చైనాలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకూ అక్కడ రూ.1100 కోట్ల వసూళ్లను సాధించేసి కొత్తచరిత్ర సృష్టించింది.

Image result for bahubali vs dangal box office collection

చైనాలో వెయ్యి కోట్ల వసూళ్లను ఇప్పటివరకూ ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేకపోయింది. ఆ ఫీట్ ను సాధించిన తొలి విదేశీ చిత్రంగా ఆమిర్ మూవీ దంగల్ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమోషన్స్ బేస్డ్ గా సాగే ఈ మూవీకి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇంకా చైనాలో ఈ మూవీ జోరు తగ్గకపోవడం అసలు సిసలైన విశేషం. 


చైనా వసూళ్ళతో కలిపి మొత్తం విశ్వ వ్యాప్తంగా దంగల్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 1800 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దంగల్ సృష్టించిన అరుదైన రికార్డుతో, బాహుబలి2 వెనక బడిపోయింది.

ఇప్పటివరకూ బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 1575 కోట్లు. దీంతో మొత్తం వసూళ్లలో బాహుబలి 2 రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, చైనా లాంటి ప్రధాన మార్కెట్ల లో బాహుబలి ది కంక్లూజన్ ఇంకా విడుదల కాలేదు. కానీ దంగల్ మాదిరిగా ఫీలింగ్స్ బేస్డ్ మూవీ కాకపోవడం, చైనాలో బాహుబలి లాంటి గ్రాఫిక్ బేస్డ్ మూవీస్ చాలానే రూపొందుతూ ఉండడం వంటి అంశాలను పరిశీలిస్తే, చైనాలో దంగల్ ను బీట్ చేయడం బాహుబలికి కష్టం కావచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.


భారత్ లో కలక్షణ్ల విషయంలో బహుబలి ది కంక్లూజన్ తోలిస్థానం నిలబెట్టుకుంది. మొత్తం కలక్షన్లలో మాత్రం దంగల్ ది తొలిస్థానమే.  

Image result for bahubali vs dangal box office collection

మరింత సమాచారం తెలుసుకోండి: