బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే ఇండస్ట్రీలో అందరికీ హడల్. ఎందుకంటే ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే సల్మాన్ ఎప్పుడు ఎవరిపై విరుచుకు పడతారో తెలియదు.  అంతే కాదు తన సహ నటుల పై చేయి చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.  ఇక కృష్ణ జింక వేట, ఫుట్ పాత్ పై పడుకున్న వారిపై కారు నడిపించాడన్న కేసులు ఆయనను మరింత కుంగ దీశాయి.   బాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ బ్యాచ్ లర్ ఎవరయ్యా అంటే సల్మాన్ ఖాన్.  అలాంటి సల్మాన్ ఖాన్ ని చెంప చెల్లు మనిపించాడు..అది కూడా ఒకసారి కాదు రెండు మూడు సార్లు.  

అదేంటీ అంత పెద్ద హీరోని చెంప చెల్లుమనిపించిన మొనగాడు ఎవరా అనుకుంటున్నారా..! ఎవరో కాదండీ ఆయన ముద్దుల మేనల్లుడు సల్మాన్ చెల్లెలు అర్పిత తనయుడు అహిల్. ఆ మద్య ఈ చిన్నారి తో సుల్తాన్ సినిమా విడుదల సమయంలో ఇలాంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు.  తాజాగా ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి తన ముద్దుల మేనల్లు ఆటలాడాడు సల్మాన్.

అహిల్‌ని సల్మాన్ బ్రదర్ సొహైల్ ఖాన్ తన రెండు చేతులతో పట్టుకోగా, ఎదురుగావున్న సల్మాన్, తన మేనల్లుడిని ఆటపట్టించాడు. సల్మాన్‌ ‘వూపర్‌ అల్లా నీచే ధర్తి బీచ్‌మే తెరా జునూన్‌’ అంటూ ‘సుల్తాన్‌’ సినిమాలోని డైలాగ్‌ చెబుతుంటే అహిల్‌ సల్మాన్‌ చెంపలు వాయించేశాడు. మేనల్లుడు కొట్టిన దెబ్బకి పడిపోయినట్లు యాక్ట్‌ చేయడం అది చూసి అహిల్‌ నవ్వడం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: