సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదువ లేదు. చివరకు ఈ సెంటిమెంట్లు నిర్మాతలకు, హీరోలకు మాత్రమే కాకుండా సినిమాలు చూసే అభిమానులకూ ఉండటం విశేషం. అందుకే కొందరు తారల కాంబినేషన్లను హిట్ పెయిర్ అంటుంటారు. వారిద్దరు జట్టు కడితే ఇక సినిమాకు మినిమమ్ గ్యారంటీ అన్న టాక్ వచ్చేస్తుంది. దాన్నే ఇప్పుడు అందరూ కెమిస్ట్రీ అని పిలుచుకుంటున్నారు. 

Image result for chiranjeevi radha photos
చిరంజీవి టాలీవుడ్ నెంబర్ 1 గా దుమ్మదులుపుతున్న రోజుల్లోనూ ఇలాంటి హిట్ పెయిర్ టాక్ ఉండేది. ప్రత్యేకించి ఒకరిద్దరు హీరోయిన్లు చిరంజీవితో పక్కన ఆడిపాడారంటే ఈ సినిమా పక్కా వందరోజులు అనే టాక్ ఉండేది. అలాంటి వారిలో ముందుండే అలనాటి హీరోయిన్ రాధ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పాత రోజులు గుర్తు చేసుకున్నారు. 

Image result for chiranjeevi radha photos

చిరంజీవితో రాధ మొత్తం 16  సినిమాల్లో హీరోయిన్ గా చేశారట. ఆ సినిమాలన్నీ బంపర్ హిట్లేనట. ఆ చిత్రాలన్నీ వంద రోజులు పూర్తి చేసుకున్నాయని.. ఆమె సంతోషంగా చెప్పారు. ప్రత్యేకించి డాన్స్ లో చిరంజీవికి పోటీగా స్టెప్పులేసే రాధ ఎక్కువ భాగం గ్లామర్ పాత్రలే పోషించానని చెప్పింది. తనను అంతగా ఆదరించిన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు రాధ. 



మరింత సమాచారం తెలుసుకోండి: