బాహుబలి తర్వాత ఆకాశమంత ఇమేజ్ పెరిగిన నటుడు ప్రభాస్.. కేరీర్ పీక్ స్థాయిలో ఉన్న సమయంలో ఒక సినిమాను నమ్మి దాదాపు నాలుగేళ్ల సమయం కేటాయించడం అంటే మాటలు కాదు.. కానీ ఇప్పుడు ఆ కష్టానికి ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ప్రభాస్ అంటే ఏంటో తెలిసింది. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ హీరో అయ్యాడు..

Image result for prabhas in bahubali

ప్రభాస్ ను బాహుబలిగా మలిచిన దర్శకధీరుడు రాజమౌళి. మరి వీరిద్దరూ కలసి నాలుగైదేళ్లు సహవాసం చేశారు.. మరి వీరు ఎలా పిలుచుకునేవారు.. వారి మధ్య సంభాషణలు ఎలా సాగేవి.. వారి ఆప్యాయతలు ఎలాంటివి. ఇలాంటివన్నీ ఆసక్తికరమే కదా. వీటిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రాజమౌళి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

Image result for prabhas and rajamouli

సాధారణంగా ప్రభాస్ అందర్నీ డార్లింగ్  అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. ప్రభాస్ ను కూడా మిగిలినవారు అలాగే పిలుస్తారు. అలా డార్లింగ్ అన్నది ప్రభాస్ పిలుపుగా స్థిరపడిపోయింది. అయితే ప్రభాస్ ను పేరు పెట్టి పెలిచి చివర్లో రాజు గారూ అని పిలిస్తే తెగ ఇబ్బందిపడిపోతాడట.

Image result for prabhas in bahubali

ప్రభాస్ రాజులకు సంబంధించిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రభాస్ ను ఏం ప్రభాస్ రాజుగారూ.. అని పిలిస్తే తెగ సిగ్గుపడిపోతాడట ప్రభాస్. ఔను.. రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి రాజుల కథతో ప్రపంచం మెచ్చే హిట్ కొట్టడం కూడా ఆసక్తికరమే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: