పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు.. రాజమౌళిలోని దర్శకత్వ ప్రతిభ బాహుబలి కంటే ముందే మగధీర సినిమాతో వెలుగు చూసింది. సోషియో ఫాంటసీ చిత్రమైన మగధీరలో రామ్ చరణ్ ను శతధ్రువంశ వీరుడిగా అద్భుతంగా చూపారు రాజమౌళి. ఆ సినిమా కోసం గతంలో ఎన్నడూ చేయనంత భారీగా కోట సెట్లు వేసి అద్భుతం ఆవిష్కరించారు. 

Image result for rajamouli and allu aravind

ఐతే.. అల్లు అరవింద్ నిర్మించిన మగధీర సినిమా నిర్మాణం సమయంలో దర్శకుడు రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్ కు చాలా గొడవలు వచ్చాయట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకూ ఉన్నరికార్డులను తిరగరాసింది మగధీర. అంతటి సక్సస్ అందించినా రాజమౌళి పట్ల అల్లు అరవింద్ తగినట్టు ప్రవర్తించలేదట.

Image result for rajamouli and allu aravind

నిర్మాణ సమయంలో మొదలైన అభిప్రాయబేధాలు, పొరపొచ్చాలు సినిమా విడుదలైన తర్వాత కూడా కొనసాగాయట. అందుకే మగధీర సినిమా శతదినోత్సవ వేడుకకు రాజమౌళి హాజరుకాలేదు. ఈ వేడుకకు రాజమౌళి రాకపోవడం అప్పట్లోనే కలకలం సృష్టించింది. కానీ ఇన్నిరోజుల తర్వాత అల్లు అరవింద్ పై ఉన్న కోపంతోనే తాను ఈ వేడుకకు రాలేదని రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదీ అసలు సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: