నాగ చైతన్య, సమంత.. టాలీవుడ్ లో లేటెస్ట్ లవ్ కపుల్.. ప్రేమలో పడటమే కాదు.. పెళ్లి ద్వారా దాన్ని శాశ్వత బంధంగా మలచుకోబోతున్నారు. అక్టోబర్ లో వీరి పెళ్లి ఉంటుందని వీరు ఇప్పటికే ప్రకటించేశారు కూడా. అయితే నాగచైతన్యకూ, సమంతకూ బిహేవియర్ లో చాలా తేడాలు ఉంటాయి. ఔను మరి అందుకే భిన్న దృవాలు ఆకర్షించుకుంటాయంటారు. 



సమంత చాలా సోషల్ గా ఉంటుంది. పర్సనల్ లైఫ్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ నాగ చైతన్య ఇందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఉన్నా.. పర్సనల్ పోస్టులు పెద్దగా పెట్టడు. తాజాగా నాగచైతన్య, సమంతలకు చెందిన కొన్ని వీడియోలను సమంత ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాలనుకుందట. 



కానీ ఆ విషయం అడిగితే నాగ చైతన్య ముందు అస్సలు ఒప్పుకోలేదట. ఇంతకీ ఆ వీడియోలు ఏంటనుకుంటున్నారా.. వారి జిమ్ విజువల్స్.. నాగ చైతన్య తన జిమ్ లో 160 కేజీల బరువులు ఎత్తుతున్న విజువల్స్ సమంతకు తెగ నచ్చాయట. అలాగే తాను కూడా కొన్ని బరువులు ఎత్తింది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటే చైతూ ససేమిరా అన్నాడట. చాలా బతిమిలాడాక కానీ చైతూ ఒప్పుకోలదట. చివరకు ఆ వీడియోలను సమంత ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: