కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాడు సీనియర్ ఆర్టిస్ట్ చలపతి రావు. రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మాయిల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చలపతి రావు మీడియా చేసిన రచ్చలో బలి పశువు అయ్యాడు. తాను తప్పు చేశాను క్షమించండి బాబోయ్ అనా సరే చీల్చి చెండాడి పోలీస్టేషన్ లో కేసు దాకా వెళ్లింది సీన్.


అయితే చలపతి రావు తనయుడు నటుడు దర్శకుడు రవిబాబు ఈ విషయం పై ఎలా స్పందిస్తారో అని అందరు ఎదురుచూశారు. ఫైనల్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో రవిబాబు తండ్రి విషయం మీద నోరు విప్పాడు. కచ్చితంగా తన తండ్రి ఆడవాళ్ల మీద అన్న మాట తప్పే అంటూ చెప్పిన రవిబాబు కాని తాను క్షమించమని చెప్పినా సరే అతన్ని విడిచిపెట్టలేదని విచారం వ్యక్తపరిచారు.


తల్లి చనిపోయినా సరే పిల్లల కోసం మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్న తన తండ్రి గురించి ఎన్నో తప్పులు చేసిన వారు కూడా మాట్లాడుతున్నారని వాపోయాడు రవిబాబు. అంతేకాదు మహిళలపై ఇంతకంటే దారుణంగా కామెంట్ చేసినా ఎవరు నోరు మెదపలేదు కాని తన తండ్రి విషయం మాత్రం పెద్ద సీన్ చేశారని అన్నాడు. ఇంకా తండ్రిని అలాంటి మాటలను అని మానసికంగా భాధపెట్టడం కన్నా భౌత దాడి చేసి చంపేయండని ఆవేదన వ్యక్తపరిచారు రవిబాబు.  


మరింత సమాచారం తెలుసుకోండి: