తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి..తర్వాత హీరోగా మారిన వారు చాలా మంది ఉన్నారు.   హీరోగా నటించినా..తర్వాత కమెడియన్లుగానే సెటిల్ అయ్యారు. అందాలరాముడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తర్వాత వరుస హిట్స్ తో మంచి హీరగా గుర్తింపు పొందాడు.  బాడీలో పూర్తిగా మార్పు తీసుకు వచ్చి సిక్స్ పాక్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.  ఇక సునీల్ డ్యాన్స్ సరేసరి..కానీ మనోడికి గత మూడు సంవత్సరాల నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది.  దీంతో వరుసగా ఫ్లాపులతో కష్టాల్లో పడ్డారు.

Image result for ungarala rambabu stills

 తాజాగా సునీల్ నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ మొన్నటి వరకు బయర్స్ ప్రాబ్లం వచ్చిందని వార్తలు వచ్చాయి.   క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు  మొదలయ్యాయి.  ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.... యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్ సరసన అందాల భామ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతమందించారు. జూన్  లో  సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

Image result for ungarala rambabu stills

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కిస్తున్న ఉంగ‌రాల రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయింది. సునీల్ నుంచి ఆశించే వంద శాతం కామెడీ ఇందులో చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు క్రాంతి మాధవ్ హిలేరియస్ కామెడీ సన్నివేశాలతో కథను అద్భుతంగా చెప్పారు. న‌వ్వించ‌మే ద్యేయంగా... అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోనే కామెడీని పొందు ప‌రిచి న‌వ్విస్తాం. ప్రకాష్ రాజ్ గారి పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మియా జార్జ్ మరో ప్లస్ పాయింట్. పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడియో సూపర్ హిట్ కావడం గ్యారంటీ.  

Related image

నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

మరింత సమాచారం తెలుసుకోండి: