బాహుబలి తర్వాత సౌత్ లో ప్రెస్టిజియస్ పిరియాడికల్ మూవీగా రాబోతున్న సినిమా సంఘమిత్ర. సుందర్ సి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్యలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శృతి హాసన్ ను హీరోయిన్ గా అనుకుని ఓ పది రోజులు షూటింగ్ కూడా చేశారు. సినిమా కోసం గుర్రపు స్వారి, కత్తిసాము లాంటి వాటిని కూడా నేర్చుకున్న శృతి హాసన్ సడెన్ గా ఈ సినిమా నుండి తప్పుకుందట.


కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా నడుస్తున్న ఈ విషయంపై శృతి హాసన్ స్పందించింది. రెండేళ్ల పాటు చేయాల్సిన ఈ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ కూడా లేదని.. సినిమా కోసం తాను డెడికేషన్ తో ఉన్నా చిత్రయూనిట్ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటున్నారని.. వారిలో అసలు సీరియస్ నెస్ లేదని అంటుంది శృతి హాసన్. అందుకే తను ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.


దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న సంఘమిత్ర బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇదవరకు కూడా శృతి హాసన్ ఓ సినిమాకు కమిట్ అవడం షూటింగ్ టైంలో హ్యాండ్ ఇవ్వడం అలవాటే కాని శృతి చెప్పిన కారణాలు మాత్రం తను చేయకపోవడం కరెక్టే అన్నట్టు అనిపిస్తున్నాయి. మరి శృతి విషయంలో ఇలా ఎందుకు రిపీట్ అవుతుందో తెలియాల్సి ఉంది.


శృతి హాసన్ తప్పుకోవడం వల్ల తన ప్లేస్ లో వేరే హీరోయిన్ దొరికే దాకా సినిమా షూటింగ్ గ్యాప్ తీసుకోనున్నారు. ఆ సినిమా కమిట్ అవ్వాలంటే దాదాపు రెండేళ్ల డేట్స్ ఇచ్చేయాలి మరి శృతి వదిలిన ఆ లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్ ను వరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: